: శ్రీలంక మునిగిపోతుందా?


గత వెయ్యేళ్ల కాలంలో ఎన్నడూ రానంత తీవ్రతతో ఈసారి సునామీ వచ్చే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మియామీ శాస్త్రవేత్త ఫాక్ అమెలంగ్ తెలిపారు. ఈ సునామీలు హిందూ మహాసముద్రంలో సంభవించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. దీంతో శ్రీలంకపై ఈ సునామీల ప్రభావం భారీగా పడనుందని ఆయన హెచ్చరించారు. శ్రీలంకలోని మెజారిటీ భూభాగం హిందూ మహాసముద్రంలోనే ఉంటుంది. ఇక్కడ తరచు భారీ భూకంపాలు వస్తుంటాయి. 22 ప్రాంతాల్లో నమూనాలను సేకరించిన తరువాత శాస్త్రవేత్త ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. 2004లో సుమత్రా దీవుల్లో 9.2 తీవ్రతతో వచ్చిన భూకంపం కంటే కూడా ఎక్కువ స్థాయిలో ప్రకంపనలు పుడతాయని ఆయన చెబుతున్నారు. అప్పట్లో వచ్చిన సునామీ కారణంగా దాదాపు రెండు లక్షల మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరిక కేవలం శ్రీలంకకే కాదని ఆ దేశంతో పాటు హిందూ మహా సముద్రంలోని చాలా ప్రాంతాల్లో త్వరలో భారీ భూకంపాలు, పెద్దపెద్ద సునామీలు రావచ్చని అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News