: సమాచారమివ్వలేదా... అయితే 25 వేలు కట్టండి!
ఢిల్లీకి చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి గతేడాది ఫిబ్రవరిలో టికెట్టు బుక్ చేసుకున్నాడు. అతను రైలు ఎక్కేందుకు స్టేషన్ కు రాగా ఆయన ప్రయాణించాల్సిన రైలును కొద్ది నెలలుగా రద్దు చేశారని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. దీంతో ఆయన ఎన్ సీడీఆర్ సీ ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్ సీడీఆర్ సీ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ అజిగ్ భారీహోక్ రైలు రద్దైన విషయం టికెట్ బుక్ చేసుకున్న మనోజ్ కుమార్ కు చెప్పకపోవడం రైల్వేల తప్పిదమేనని నిర్థారించారు. దీంతో అతనికి 25 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించారు.