: 170 ఏళ్ల క్రితం మునిగిన నౌక కనబడింది
ఆర్కిటిక్ సముద్రంలో 170 ఏళ్ల క్రితం మునిగిపోయిన బ్రిటిష్ నౌక ఓ కెనడా ఆర్కియాలజిస్టు కంటబడింది. కెనడా ఉత్తర తీర ప్రాంతంలో సముద్రం అడుగు భాగాన రిమోట్ ఆధారంగా పని చేసే వాహనం ద్వారా నౌక శిథిలాలను గుర్తించినట్టు కెనడా వెల్లడించింది. ఈ నౌకను సాహస నావికుడు సర్ జాన్ ఫ్రాంక్లిన్ కు చెందినదిగా గుర్తించారు.