: పాక్ కోరుకుంటే మళ్లీ చర్చలకు సిద్ధం: రాజ్ నాథ్ సింగ్


పాకిస్థాన్ కోరుకుంటే మళ్లీ చర్చలు జరిపేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం సిద్ధమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అది కూడా, పొరుగుదేశం సానుకూలంగా ప్రతిస్పందిస్తేనే అర్థవంతమైన చర్చలు జరుగుతాయన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పొరుగుదేశాలతో తాము మంచి సంబంధాలను కోరుకుంటున్నామని... కానీ, అవసరమైనప్పుడు స్పందించేందుకు తగినంత సామర్థ్యం కలిగి ఉండాలను కుంటున్నామన్నారు. భారత్, పాక్ కొత్తగా చర్చలు జరిపేందుకు ఇదే సమయమంటూ కొద్దిసేపటి కిందట ఆ దేశ రాయబారి అబ్దుల్ బాసిత్ అభిప్రాయపడిన వెంటనే హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News