: పేరుకి పెద్దమనిషి... బుద్ధి లేకి బుద్ధి
మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో స్కూల్ కరస్పాండెంట్ గా వ్యవహరిస్తూ, పెద్దమనిషిలా తిరిగే జానకిరామ్ రెడ్డి అనే వ్యక్తి లేకి బుద్ధి బయటపడింది. ఓ ప్రైవేట్ స్కూల్ ను నడిపిస్తున్న జానకిరామ్ రెడ్డి టెన్త్ విద్యార్థినికి నీలి చిత్రాలు చూపిస్తున్నాడని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నీతిమాలిన చర్యలకు దిగిన జానకిరామ్ రెడ్డిని తక్షణం అరెస్టు చేయాలంటూ విద్యార్థి నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ లైసెన్స్ రద్దు చేయాలని వారు ఎలుగెత్తారు.