: అరెస్టు చేయండంటూ 'ఐపీఎస్' వెంటపడుతున్నారు... సోషల్ మీడియాలో వేలంవెర్రి!


సామాజిక మాధ్యమాల్లో దేన్నయినా వేలంవెర్రిగా అనుసరిస్తుంటారు అనేదానికి తార్కాణమైన ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఐపీఎస్ శిక్షణ అనంతరం మెరిన్ జోసెఫ్ అనే ఓ అందమైన మహిళా ట్రైనీ ఆఫీసర్ రెండు వారాల 'ఆన్ ఫీల్డ్' శిక్షణ కోసం కొచ్చికి వచ్చారు. ట్రైనీ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పౌర సమస్యలకు సంబంధించిన ఓ ఫేస్ బుక్ పేజ్ లో ఆమెకు స్వాగతం పలుకుతూ ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు పది వేల లైకులు వచ్చాయి. షేర్లుకూడా అధికమే, వాట్సప్ లో కూడా ఆ ఫొటోను విస్తృతంగా షేర్ చేసుకున్నారు. అంత అందమైన ఆఫీసర్ చేతితో బేడీలు వేయించుకోవడం కోసం తాము ఏమైనా చేస్తామని అక్కడి యువత అంటున్నారు. నిక్కీ అనే కుర్రాడైతే తాను దోపిడీలు మొదలు పెట్టేస్తానని బహిరంగంగా ప్రకటించాడు. 'ఇంత అందమైన పోలీస్ ఆఫీసర్ కొచ్చిని పాలిస్తుంటే చూడడానికి చాలా సంతోషంగా ఉంది. మీకు అభినందనలు' అంటూ పోస్టు చేశాడు. మరో యూజర్ తనను అరెస్టు చేయాలంటూ... మాలీవుడ్ నటుడు మోహన్ లాల్ అడుగుతున్నట్టుగా ఓ ఫోటో మార్ఫ్ చేసి పెట్టాడు. ఆమె శిక్షణ పూర్తి చేసుకుని ఢిల్లీ వెళ్లిపోయినప్పటికీ ఫేస్ బుక్ లో ఆమె ఫోటోను లైక్ చేయడం ఆపట్లేదు. మమ్మల్ని అరెస్టు చేయండంటే, మమ్మల్ని అరెస్టు చేయండంటూ ఫేస్ బుక్ లో పోస్టులు కూడా ఆగడం లేదు. 2012లో తొలి ప్రయత్నంలో ఐపీఎస్ సాధించిన మెరిన్ జోసెఫ్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ ఆనర్స్ చేశారు.

  • Loading...

More Telugu News