: ''వాళ్ల బొమ్మలే, వాళ్ల కబుర్లే... మేం మనుషులం కాదు'': 'నమస్తే తెలంగాణ'పై వీహెచ్ ఫైర్


నమస్తే తెలంగాణ పత్రికపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విరుచుకుపడ్డారు. ఆ పత్రికకు టీఆర్ఎస్ నాయకులు తప్ప... మిగతా పార్టీల నాయకులెవరూ మనుషుల కింద కనపడటం లేదని ఆయన మండిపడ్డారు. ''వాళ్ల బొమ్మలే, వాళ్ల కబుర్లే... మేం మనుషులం కాదు... నమస్తే తెలంగాణ పేపర్ మా గురించి రాయదు'' అని ఆయన మండిపడ్డారు. తాము తెలంగాణ గురించి మాట్లాడినా కూడా ఎందుకు రాయడం లేదని ఆయన ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ గురించే ఎందుకు రాస్తున్నారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్ బయట... లోపల ఎన్నో పోరాటాలు చేసి... సోనియాను ఒప్పించి తెలంగాణను తెచ్చింది తామని... అయినా తమకు ఏమాత్రం విలువనివ్వడం లేదని ఆయన ఆవేదన చెందారు.

  • Loading...

More Telugu News