: ఆసియా క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లకు నాసిరకం ఆహారం


ఆసియా క్రీడల్లో పాల్గొనే మన బాక్సర్లు, సైక్లిస్టులు, జిమ్నాస్ట్ లకు ఢిల్లీలో శిక్షణ కార్యక్రమం ఆరంభించారు. అయితే, ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో శిక్షణ సందర్భంగా నాసిరకం ఆహారం అందించడంపై అథ్లెట్లు మండిపడుతున్నారు. ఆహారం సరిగా లేదని, కిచెన్ అపరిశుభ్రంగా ఉందని, ముడి సరుకులు కూడా మామూలుగానే నిల్వ చేసి ఉన్నాయని వారు ఆరోపించారు. వంటగది నిండా బొద్దింకలు తారాడుతున్నాయని తెలిపారు. దీనిపై స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కపిల్ కౌల్ ను వివరణ అడగ్గా, ఆయన మండిపడ్డారు. "ఎక్కడున్నాయ్ బొద్దింకలు?" అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. అయితే, ఎలుకలు పెను సమస్యగా మారాయని తెలిపారు. క్రిమికీటకాలను నిర్మూలించేందుకు పురుగుమందులు వాడొద్దని ఆహార నిపుణులు సూచించారని, అందుకే, తాము వాటి జోలికి వెళ్ళలేదని కౌల్ పేర్కొన్నారు. కాగా, ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు దక్షిణకొరియాలోని ఇంచియాన్ వేదికగా జరగనున్నాయి.

  • Loading...

More Telugu News