: ప్రపంచమంతా వివేకానందుడి సందేశాన్ని అనుసరించాలి: పీఎం మోడీ


స్వామి వివేకానంద బోధించిన విశ్వ సోదర సందేశాన్ని అనుసరిస్తే దారుణ చర్యలను నివారించవచ్చని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెబుతున్నారు. ఈ మేరకు మాట్లాడుతూ, "స్వామిజీ సందేశాన్ని అందరూ అనుసరిస్తే 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో చోటుచేసుకున్న జంట దాడులకు చరిత్ర సాక్ష్యంగా నిలిచేదేకాదు. అందుకని ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకుందాం. ఐక్యత, సోదరభావం, ప్రపంచ శాంతి కోసం మనల్ని మనం అంకితం చేసుకుందాం" అని ట్వీట్ చేశారు. అంతేగాక, సెప్టెంబర్ 11న చరిత్రలో రెండు సంఘటనలున్నాయన్న మోడీ... ఒకటి 2001 విధ్వంసం, మరొకటి 1893లో స్వామి వివేకానంద సందేశం అని తెలిపారు. వివేకానందుడు షికాగోలో సర్వమత సమ్మేళనంలో చేసిన తన ప్రసంగంలో మన దేశం యొక్క గొప్ప చరిత్రను, బలమైన సాంస్కృతిక మూలాలను వివరించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారని మోడీ వివరించారు. "కాబట్టి, అమెరికా సోదర సోదరీమణులారా... వివేకానందుడి మాటలతో, విశ్వ సోదర భావంతో ఉండాలన్న భారత సందేశంతో ప్రపంచమంతా ప్రతిధ్వనించాలి" అని మోడీ పేర్కొన్నారు. ఈ నెలాఖరున ప్రధాని మోడీ రెండు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ట్వీట్లు చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News