: విమానంలో భారతీయుడి కాముక చేష్టలు... రెండేళ్ళ జైలుశిక్ష
విమానంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భారత జాతీయుడికి అమెరికా కోర్టు రెండేళ్ళ జైలుశిక్ష విధించింది. దేవేంద్ర సింగ్ (62) అనే వ్యక్తి హూస్టన్ నుంచి నెవార్క్ వెళ్ళేందుకు యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం ఎక్కాడు. అతని పక్క సీట్లో ఓ మహిళ కూర్చుంది. విమానం గాల్లోకి లేచిన తర్వాత, కాసేపటికి, ఆ మహిళ నిద్రలోకి జారుకుంది. ఆమెను ఆ స్థితిలో చూసిన దేవేంద్ర సింగ్ లో పాడు బుద్ధులు చోటు చేసుకున్నాయి. సీన్ కట్ చేస్తే... పక్క ప్రయాణికుడు తన ముఖాన్ని ముద్దాడుతుండడం, అతని చేయి తన షర్టులో ఉండడాన్ని ఆమె గమనించింది. వెంటనే సిబ్బందికి తెలిపింది. వారు పోలీసులకు సమాచారమందించగా, సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన స్థానిక కోర్టు ఆ కామాంధుడికి రెండేళ్ళ జైలుశిక్ష, రూ.1.5 కోట్ల జరిమానా విధించింది. అక్టోబర్ 23 నుంచి సింగ్ కు జైలుశిక్ష అమల్లోకి వస్తుంది.