: విశాఖ జిల్లాలో బాలుడి కిడ్నాప్... రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు
విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం గ్రామంలో ఓ ఫైనాన్స్ వ్యాపారి కుమారుడిని మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. బాలుడి వయసు పదేళ్లు. కుమారుడు కనపడకపోవడంతో తల్లిదండ్రులు రెండ్రోజులుగా ఆందోళన చెందుతుండగా నిన్న కిడ్నాపర్లు ఓ కాయిన్ బాక్స్ నుంచి ఫైనాన్స్ వ్యాపారికి కాల్ చేశారు. బాలుడిని తామే అపహరించామని... రూ.30 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి ఫైనాన్స్ వ్యాపారి కావడంతో, ఎవరో అతడి నుంచి అప్పు తీసుకున్నవాళ్లే కిడ్నాప్ కు పాల్పడి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.