: తెలంగాణలో మీడియాపై ఆంక్షలు సరికాదు: జైపాల్ రెడ్డి


తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ చానళ్ళ ప్రసారాల నిలిపివేతను కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆ వ్యాఖ్యలతో తెలంగాణలో మీడియాకు స్వేచ్ఛ లేదని జాతీయ స్థాయిలో వెల్లడైందన్నారు. ప్రజాస్వామ్యానికి పునాది పత్రికా స్వేచ్ఛ అని, ప్రజాస్వామిక తెలంగాణగా కొనసాగాలన్నారు. అభద్రతా భావాన్ని నెలకొల్పే చర్యలను సహించబోమని చెప్పారు. పెట్టుబడులు రావాలంటే రాజకీయ ఔదార్యం ప్రదర్శించాలని సూచించారు. సీమాంధ్రుల భద్రతపై కేసీఆర్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జైపాల్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News