: నేటితో ముగుస్తున్న మెదక్ ప్రచారం
టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ ఎన్నికకు గత నెల 18న నోటిఫికేషన్ విడుదలైంది. అప్పట్నుంచి ప్రచారం జోరుగా సాగింది. అన్ని పార్టీల నేతల ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచార పర్వం ఆద్యంతం వాడి, వేడిగా కొనసాగింది. ఈ సాయంత్రం 6 గంటల తర్వాత మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు లేని వారంతా వెళ్లిపోవాలని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఆదేశించారు. మొత్తం 14 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 1,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.