: నా వెంట విమల్ నూ పంపించండి: సైనా నెహ్వాల్
ఆసియా క్రీడలకు తనతో పాటు తన కొత్త కోచ్ విమల్ ను కూడా ఇంచియాన్ కు పంపించాలని స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)కు విజ్ఞప్తి చేసింది. ఇంచియాన్ కు వెళ్లే కోచ్ ల జాబితాలో విమల్ పేరును కూడా చేర్చాలని కోరింది. ఇటీవలే కోచ్ గోపీచంద్ నుంచి విడిపోయి కొత్త కోచ్ ను సైనా నియమించుకున్న సంగతి తెలిసిందే. సైనా విజ్ఞప్తిని పరిశీలిస్తున్నామని... త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని 'బాయ్' సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అదనంగా మరో కోచ్ ఉండటం ఆటగాళ్లకు కూడా లాభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత వారం రోజుల నుంచి విమల్ వద్ద సైనా ప్రాక్టీస్ చేస్తోంది.