: పరిటాల, వంగవీటి హత్యలపై బాబును మంత్రి సునీత అడగాలి: వంగవీటి రాధా
పరిటాల హత్య కేసులో ఆరోపణలున్న జేసీ దివాకర్ రెడ్డి సోదరులను టీడీపీలోకి ఎలా చేర్చుకున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పరిటాల సునీత అడగాలని వంగవీటి రాధా సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలుగా ఉన్నారని అన్నారు. ప్రజలకిచ్చిన హామీల సంగతి అడిగితే, వైఎస్సార్సీపీ నేతలను టీడీపీ టార్గెట్ చేస్తోందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీడీపీ చేస్తున్న ఆరోపణలపై న్యాయ, సీబీఐ విచారణకు సిద్ధమని రాధా సవాలు విసిరారు. అవాకులు చవాకులు పేలడం మానేసి ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి నిలపాలని ఆయన హితవు పలికారు.