: కేంద్రం నుంచి 5,120 కోట్లు రావాలి: ఈటెల


తెలంగాణ వాటా కింద కేంద్రం నుంచి 5,120 కోట్ల రూపాయలు రావాలని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని కేంద్రం తెలిపిందని అన్నారు. ఒకే పన్ను విధానం అమలు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన సూచించారు. తెలంగాణలో ఎక్సైజ్, పెట్రో ఉత్పత్తులపై ఎక్కువ ఆదాయం వస్తుందని, ఇలాంటి ఆదాయాన్ని జీఎన్ టీలో కలపమని కేంద్రానికి తెలిపినట్టు ఆయన వెల్లడించారు. వరి, పొగాకుపై వచ్చే ఆదాయం కూడా జీఎన్ టీలో కలపమని కేంద్రానికి చెప్పామని ఆయన స్పష్టం చేశారు. తాము సూచించిన అంశాలను ఆర్థిక సంఘం తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నామని ఈటెల తెలిపారు. కేంద్రం ఏసీ గదుల్లో కూర్చుని కార్యక్రమాలు రూపొందించకూడదని కోరుతున్నామని ఈటెల స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News