: నాకూ వ్యవసాయం ఉంది...రుణమాఫీ అమలు చేస్తా: కేసీఆర్


తనకూ వ్యవసాయం ఉందని, రైతు రుణమాఫీని అమలు చేస్తానని కేసీఆర్ తెలిపారు. మెదక్ ఉపఎన్నికల నేపథ్యంలో నర్సాపూర్ లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రిజర్వ్ బ్యాంక్ మూడు జిల్లాల్లో మాత్రమే రుణమాఫీకి అనుమతిచ్చిందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కూడా దశలవారీగా అమలు చేస్తామని ఆయన గుట్టు విప్పారు. దసరా పండగకు తెలంగాణలో సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని కేసీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం నమ్మొద్దని ఆయన సూచించారు. పొన్నాల పిచ్చిమాటలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. మూడేళ్ల తరువాత తెలంగాణలో ప్రతి ఇంటికీ 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. తనకంటే ఎక్కువ మెజారిటీతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. సర్వేలో పాల్గొన్నట్టే ఓటింగ్ లో పాల్గోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News