: నేను గెలిస్తే టీఆర్ఎస్ నేతలతో ఇక బంతాటే!: జగ్గారెడ్డి


మెదక్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు, బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నర్సాపూర్ బహిరంగ సభలో తనపై కేసీఆర్ చేసిన విమర్శలకు జగ్గారెడ్డి ఘాటుగా బదులిచ్చారు. తెలంగాణ కేసీఆర్, హరీష్ రావుల జాగీరు కాదని అన్నారు. తాను గెలవడం ఖాయమని తెలిపిన జగ్గారెడ్డి, తాను నెగ్గిన మరుక్షణం నుంచీ టీఆర్ఎస్ నేతలతో బంతాట ఆడుకుంటానని అన్నారు. బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ భయబ్రాంతులను చేస్తోందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News