: అజ్మల్ సాధించిన వికెట్లన్నీ సక్రమమేనా?: బిషన్ సింగ్ బేడీ ప్రశ్నాస్త్రం


అక్రమ బౌలింగ్ యాక్షన్ కనబరిచే బౌలర్లపై భారత స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ తరచూ విమర్శల దాడి చేస్తుంటారు. తాజాగా, ఆయన సస్పెన్షన్ కు గురైన పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ వ్యవహారంలో ఐసీసీకి ప్రశ్నాస్త్రాలు సంధించారు. అతను సాధించిన వికెట్లన్నీ సక్రమమేనా? అని ప్రశ్నించారు. అక్రమ యాక్షన్ తో అజ్మల్ ఎన్నో వికెట్లు తీశాడని, అతని కారణంగా ఎన్నో జట్లు ఓటమిపాలయ్యాయని, ఇప్పుడా నష్టాన్ని పూడ్చగలరా? అని సూటిగా అడిగారు. "అజ్మల్ లాంటి వాళ్ళను ఇన్నాళ్ళూ అనుమతించి, ఇప్పుడు సస్పెన్షన్ వేటు వేసిన ఐసీసీ, తన తప్పును అంగీకరించగలదా? అలా అంగీకరించలేకపోతే, ఈ బౌలర్లను సంస్కరించడంలో ఔచిత్యం ఏమిటి?" అని ప్రశ్నించారు. అసలు, అజ్మల్ విషయంలో ఇప్పటిదాకా ఐసీసీ ఏం చేస్తున్నట్టని నిలదీశాడీ సర్దార్జీ. ఐసీసీ ఓ 'సంస్కరణల పాఠశాల' మాదిరి వ్యవహరిస్తోందని అన్నారు. అజ్మల్ సాధించిన వికెట్లను పరిశీలించాలని సూచించారు.

  • Loading...

More Telugu News