: వంగవీటి హత్య కేసులో బాబే మొదటి ముద్దాయి... దీనికేమంటారు?: అంబటి రాంబాబు


అసెంబ్లీలో వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రంలోని శాంతి భద్రతల గురించి మాట్లాడితే, టీడీపీ నేతలు సమస్యను వదిలేసి పరిటాల హత్య గురించి మాట్లాడతారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పరిటాల హత్య గురించి మాట్లాడాల్సి వస్తే అంతకంటే ముందు జరిగిన వంగవీటి మోహన రంగా హత్య గురించి మాట్లాడాలని టీడీపీకి కౌంటర్ విసిరారు. వంగవీటి హత్య కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రథమ ముద్దాయి అవుతాడని అంబటి స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని, ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు జరిగేలా చూస్తుందని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News