: కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకారం


ఆర్టీసీలో కొన్నాళ్లుగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించేందుకు ఎట్టకేలకు యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ నేతలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సొసైటీకి చెల్లించాల్సిన కోట్ల రూపాయల బకాయిల మొత్తాన్ని వెంటనే చెల్లించేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. అంతేగాక, డీఏ బకాయిలు, రాబోయే దసరా పండుగ సందర్భంగా అడ్వాన్సును చెల్లించేందుకు కూడా ఆర్టీసీ లిఖిత పూర్వక హామీతో సమ్మతి తెలిపింది. వాటన్నింటినీ నిర్ణీత గడువులోగా చెల్లిస్తామని చెప్పింది. ఈ క్రమంలో కార్మికులు రేపటి నుంచి చేపట్టాల్సిన సమ్మెను విరమించుకున్నారు. కొన్నాళ్లుగా ఆర్టీసీ కార్మికులు లోన్ కు దాఖలు చేసుకున్నా సొసైటీ మంజూరు చేయడం లేదు. కారణం... ఆర్టీసీ బకాయిలు చెల్లించకపోవడమే. ఈ క్రమంలోనే కొన్ని నెలల నుంచి కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News