: ఇండోనేసియాలో భారీ భూకంపం
ఇండోనేసియా తూర్పుతీరంలో భారీ భూకంపం సంభవించింది. సులవేశి ద్వీపంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.5గా నమోదైంది. తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతమే అయినప్పటికీ, భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలంతా ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంపం ధాటికి ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ, నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.