: హెలికాప్టర్లపైకి రాళ్లు విసురుతున్న వరద బాధితులు
ఆపదలో ఉన్నవారికి సాయం చేసేందుకు వచ్చిన వారిని దేవుడిలా భావిస్తాం. కానీ, జమ్మూకాశ్మీర్ లో పూర్తి విరుద్ధ సంఘటన చోటుచేసుకుంది. వరదల బారిన పడి అసహాయ స్థితిలో ఉన్న జమ్మూకాశ్మీర్ ప్రజలకు సహాయం చేసేందుకు అన్ని రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి, సైనికులు, భద్రతా బలగాలు, జాతీయవిపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది... ఇలా ముమ్మరంగా సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు. అయినా, సహాయక చర్యలు అందించేందుకు ఆలస్యంగా వచ్చారని ఇద్దరు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిపై జమ్మూకాశ్మీర్ స్థానికులు దాడిచేశారు. దీంతో, ఆ ఇద్దరిలో తీవ్రంగా గాయపడిన ఒకరిని చండీగఢ్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, సహాయక చర్యలకు వచ్చిన హెలీకాప్టర్లపైకి రాళ్లు విసురుతున్నారు. దీంతో, హెలికాప్టర్లు కిందికి దిగలేకపోతున్నాయని సిబ్బంది తెలిపారు.