: నందిగామలో కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తాం: మంత్రి రావెల
కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం ఉపఎన్నికకు అభ్యర్థిని నిలబెట్టే హక్కు కాంగ్రెస్ కు లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తామని చెప్పారు. టీడీపీ నుంచి దివంగత తంగిరాల ప్రభాకర్ కుమార్తె తంగిరాల సౌమ్య ఈ స్థానానికి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబురావు పోటీ చేస్తున్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా పోటీలో ఉన్నారు. ఈ నెల 13న నందిగామ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. పదహారున ఓట్లు లెక్కిస్తారు.