: మాజీ ఎమ్మెల్యే మేనకోడలికి చంపేస్తామంటూ బెదిరింపులు


విశాఖపట్నం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మేనకోడలు సింధూర... వంశీ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఈ నేపథ్యంలో తమకు బంధువుల నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ సింధూర, వంశీ డీసీపీకి ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న సింధూర, వంశీ ఈనెల 8న పెద్దల అనుమతి లేకుండా సింహాచలం అప్పన్న సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు. దీంతో, సింధూర మైనరని, వారి పెళ్లి చెల్లదని వాదించిన అమ్మాయి తరపు బంధువులు, ఇద్దరితో పురుగుల మందు తాగించి చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో, ఈ జంట మహిళా సంఘాల సాయంతో డీసీపీని కలిసి రక్షణ కల్పించాలని కోరారు.

  • Loading...

More Telugu News