: జమ్మూకాశ్మీర్ కు రూ. 5 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
వరదలతో అట్టుడికిపోతున్న జమ్మూకాశ్మీర్ కు సహాయం చేసేందుకు దేశంలోని చాలా రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు కాశ్మీర్ కు ఆర్థిక సహాయాన్ని ప్రకటించగా... తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం 5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. దీంతో పాటు 300 టన్నుల పౌష్టిక ఆహారాన్ని కూడా కాశ్మీర్ కు పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే, తొలివిడతగా 140 మెట్రిక్ టన్నుల ఆహార పొట్లాలను కాశ్మీర్ కు పంపామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. ఇక పేద రాష్ట్రమైన ఒడిశా కూడా కాశ్మీర్ కు రూ. 5 కోట్ల ఆర్థికసహాయాన్ని ప్రకటించింది.