: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు స్టింగ్ ఆపరేషన్ సీడీని సమర్పించిన ఆప్


ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, పార్టీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత ఒకరు ప్రయత్నించినప్పటి స్టింగ్ ఆపరేషన్ సీడీని ఆయనకు సమర్పించారు. అంతేకాక ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ నెల నాలుగున రాష్ట్రపతికి రాసిన లేఖను తిరిగి సవరించాలని కోరారు. అనంతరం ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ, ఎల్జీకి సీడీని సమర్పించామని, ఆ వీడియోను చూడాలని ఆయనను కోరినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News