: మరి, 'టీ న్యూస్' మెడలు ఎవరు వంచాలి?: పొన్నం ప్రభాకర్
ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్థాయి వ్యక్తి మీడియాను అణచివేస్తామనడం సరికాదని కరీంనగర్ లో అన్నారు. ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడం సమంజసమా? అని ప్రశ్నించారు. విపక్షాల వార్తలను 'టీ న్యూస్' చానెల్ లోను, 'నమస్తే తెలంగాణ' పత్రికలోను కవర్ చేయడంలేదని చెప్పిన పొన్నం... వాటి మెడలు ఎవరు వంచాలని సూటిగా అడిగారు. వందరోజుల కేసీఆర్ పాలనలో వివిధ పార్టీల నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం తప్ప చేసిందేమీలేదని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ను ఎందుకు భాగస్వామ్యం చేయడంలేదని అడిగారు.