: పత్రికల నోరునొక్కే ప్రయత్నం చేయడం సరికాదు: వెంకయ్యనాయుడు


మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం గౌరవించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పత్రికలు, ప్రసార సాధనాలకు సముచిత స్థానం కల్పించాలని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం, ప్రతిపక్షం, పత్రికలు, ప్రసార సాధనాలు కలిసి పనిచేస్తేనే ప్రజాస్వామ్యం అర్థవంతం అవుతుందని పేర్కొన్నారు. పత్రికల నోరునొక్కే ప్రయత్నం చేయడం సరికాదని ఆయన సూచించారు. ప్రసార సాధనాలు, పత్రికలు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టాలు ఉన్నాయని, ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాలు నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ సదరు చానెళ్ల మహిళా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఆ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News