: ప్రధాని మోడీకి ఆప్ నేత మెచ్చుకోలు


ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనకు సంబంధించి పలు విషయాలపై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత కుమార్ విశ్వాస్ పొగడ్తలతో ముంచెత్తారు. ఓ ఆంగ్ల ఛానల్ తో మాట్లాడుతూ, "ప్రధాని బాగా పనిచేస్తే ఆయనను ప్రశంసించేందుకు నాకు హక్కుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పోల్చితే మోడీయే ఉత్తమ పీఎం" అని అన్నారు. అంటే, పాలనలో మోడీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారా? అని విశ్వాస్ ను అడిగితే, గత ప్రభుత్వం కంటే ఆయన గవర్నమెంట్ పనితీరు కొన్ని విషయాల్లో చాలా చురుకుగా ఉందన్నారు. కానీ, బ్లాక్ మనీని వెనక్కి తీసుకొస్తామన్న ఎన్నికల హామీ ఇంకా పూర్తికాలేదన్నారు. ఇదే సమయంలో మోడీ జపాన్, కాశ్మీర్ పర్యటనల గురించి మాట్లాడిన ఆప్ నేత, ఆయన జపాన్ వెళుతున్నప్పుడు "ఇది ఆహ్వానించదగిన చర్య" అని తాను ట్వీట్ చేశానని పేర్కొన్నారు. అటు మోడీ తమ ప్రధాని అని జమ్మూకాశ్మీర్ ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News