: రేషన్ డీలర్లకు కమిషన్ పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నాం: పరిటాల సునీత
గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో పౌరసరఫరాల వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని... అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. ఈ శాఖను ప్రక్షాళన చేసే పనిలో ఉన్నామని ఆమె తెలిపారు. రేషన్ డీలర్లకు కమిషన్ పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఉదయం ఆమె గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన పానకాల స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.