: ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపిన భారత సైన్యం
జమ్మూకాశ్మీర్ లో ఈ ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భారత్, పాక్ సరిహద్దుల్లోని కేరన్ సెక్టర్ వద్ద భారత్ లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు పాక్ ఉగ్రవాదులను భారత సైన్యం కాల్చి చంపింది. ఉగ్రవాదులు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను కలిగి ఉన్నారని సైన్యం తెలిపింది. ఓ వైపు భారీ వరదలతో కాశ్మీర్ అతలాకుతలమై ఉంటే... మరోవైపు ఈ పరిస్థితిని అదనుగా తీసుకుని ముష్కరులు చొరబాట్లకు యత్నిస్తున్నారు.