: నేడు చంద్రబాబు-భువనేశ్వరిల పెళ్లి రోజు, నాటి శుభలేఖను అపురూపంగా దాచుకున్న అభిమాని


నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతుల పెళ్లి రోజు. చంద్రబాబు పెళ్లి జరిగి నెేటికి 33 ఏళ్లు పూర్తయ్యింది. అప్పట్లో ఆయన పంపిన పెళ్లి శుభలేఖను చిత్తూరు జిల్లాకు చెందిన ఒక అభిమాని కుటుంబం విలువైన జ్ఞాపికగా, తీపి గుర్తుగా ఇప్పటికీ అపురూపంగా దాచుకుంది. 1981 సెప్టెంబర్ పదవ తేదీన... అప్పట్లో సినిమాటోగ్రఫీ, పురాతత్వశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబుకు... నందమూరి తారకరామారావు కుమార్తె భువనేశ్వరితో చెన్నైలోని కళైవానర్ అరంగం ఆడిటోరియంలో ఘనంగా పెళ్లి జరిగింది. తన వివాహానికి కేవలం ఆప్తులైన కొంతమందికి మాత్రమే చంద్రబాబు శుభలేఖలు పంపారు. ఆ కొంతమందిలో చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలానికి చెందిన కాలేషా కుటుంబం కూడా ఉంది. 30 ఏళ్లు దాటినప్పటికీ... తమ అభిమాన నాయకుడి పెళ్లి శుభలేఖను ఇప్పటికీ 'కొత్త శుభలేఖ'లాగే కాలేషా కుటుంబం అపురూపంగా చూసుకుంటోంది.

  • Loading...

More Telugu News