: 29, 30 తేదీల్లో మోడీ, ఒబామాల భేటీ... ఖరారైన పర్యటన


భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారయింది. ఈ నెల 29, 30 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో మోడీ భేటీ అవుతారు. ఈ సందర్భంగా, పలు ద్వైపాక్షిక, రక్షణ, వ్యూహాత్మక, ఆర్థిక అంశాలపై ఇరు నేతలు చర్చలు జరపనున్నారు. వీటితో పాటు ప్రాంతీయ అంశాలు, సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ అంశాలపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. మోడీకి స్వాగతం పలికేందుకు, మోడీతో కలసి పనిచేసేందుకు ఒబామా ఎదురు చూస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. 2005లో మోడీకి వీసా ఇవ్వడానికి అమెరికా నిరాకరించింది. అయితే, అఖండ విజయం సాధించి భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అగ్రరాజ్యం తన వైఖరి మార్చుకోక తప్పలేదు. మోడీ ప్రధాని అయిన వెంటనే తమ దేశంలో పర్యటించాలంటూ ఒబామా ఆహ్వానించారు. మోడీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి వెల్లడించారు.

  • Loading...

More Telugu News