: మోడీపై దాడికి ‘ముంబై వీడియో’తో ప్రేరేపణ!


గతేడాది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీపై దాడికి అమాయక యువతను ఉసిగొల్పేందుకు తీవ్రవాదులు హైదర్ అలీ, ఉమర్ సిద్ధిఖీలు భారీ పన్నాగాన్నే పన్నారు. తమ చేతికి మట్టి అంటకుండా, మోడీని హతమార్చేందుకు పథక రచన చేసిన ఆ ఇద్దరు కరడుగట్టిన తీవ్రవాదులు యువతను తమ పావులుగా వాడుకున్నారు. ఎలాగోలా తమ దారికి తెచ్చుకున్న ఓ యువకుడికి ముంబై దాడుల వీడియోలు చూపి, మోడీపై దాడికి సమాయత్తం చేశారు. అంతేకాక అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి చేసింది అల్ ఖైదానేనని ఆ యువకుడికి బోధించారు. ముజఫర్ నగర్ అల్లర్లకు మోడీతో పాటు బీజేపీ నేతలే కారణమని చెబుతూ ఆ యువకుడిని మానవ బాంబుగా మార్చేసేందుకు యత్నించారు. అయితే, తదనంతర పరిణామాల నేపథ్యంలో సదరు యువకుడు మానవ బాంబుగా మారేందుకు నిరాకరించడంతో మరో ఇద్దరు కుర్రాళ్లను చూడాలని అలీ, ఉమర్ కు చెప్పినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన చార్జీషీట్ లో వెల్లడించింది. పాట్నాలో జరిగిన సభలో పాల్గొన్న మోడీపై దాడి చేసేందుకు ఎంచుకున్న యువకులకు ముంబై దాడుల వీడియో టేపులను చూపి వారిలో ఉత్తేజం నింపారు. అయితే ఆ యువకులు మోడీ సభపై కాకుండా, ర్యాలీని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

  • Loading...

More Telugu News