: అమెరికాను వణికిస్తున్న కొత్త వైరస్


అగ్రరాజ్యం అమెరికాను సరికొత్త వైరస్ వణికిస్తోంది. దేశంలోని దాదాపు 10 రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రతాపం చూపిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన చిన్నారులు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. జలుబు కారక వైరస్ కుటుంబానికి చెందిన ఈ వైరస్ పేరు 'ఎంటరోవైరస్ 68'. ఈ వైరస్ బారిన పడి ఒక్క కాన్సాస్ నగరంలోనే దాదాపు 500 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. గత నెల మూడో వారంలో ఈ వైరస్ లక్షణాలు కనిపించడం ప్రారంభమైంది. త్వరలోనే ఈ వైరస్ ను అరికడతామని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News