: అక్టోబర్ 9న షార్ నుంచి పీఎస్ఎల్ వీ ప్రయోగం
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి అక్టోబర్ 9వ తేదీన వేకువజాము 2 గంటలకు పీఎస్ఎల్ వీ-సీ 26 వాహకనౌకను నింగిలోకి ఇస్రో పంపనుంది. ఈ వాహక నౌక ద్వారా నావిగేషన్ కు సంబంధించిన ఐఆర్ఎన్ఎన్ఎఫ్-1సీ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహాన్ని ఈ మధ్యాహ్నం బెంగళూరు నుంచి షార్ కు తరలించారు.