: కేసీఆర్ ఫాసిస్టు... ఇంత దుర్మార్గమా?: దిలీప్ కుమార్
కేసీఆర్ అంతటి ఫాసిస్టును చూడలేదని ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ రోజు మీడియా ప్రతినిధులపై జరిగిన దాడి అమానుషమన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులను రిపోర్ట్ చేసే జర్నలిస్టులపై జరిగిన దాడి హేయమని ఆయన అన్నారు. అసలు తెలంగాణ ఉద్యమకారులు ఎవరో, ఎవరిని తెలంగాణ వారిగా గుర్తించాలో టీఆర్ఎస్ నేతలు స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ జెండా కూడా పట్టని వారు మంత్రులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యమాన్ని తీవ్రంగా విమర్శించిన వారు ఎమ్మెల్యేలవుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు తెలంగాణ వారో ఎలా నిర్ణయిస్తామని ఆయన నిలదీశారు.