: 21,807 కాల్స్, మెసేజ్ లతో మాజీ ప్రేయసిని భయపెట్టాడు
ఫోన్ అంటే భయపడేలా మాజీ ప్రేయసిని భయపెట్టాడా భగ్న ప్రేమికుడు. ఫ్రాన్స్ కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి తన 32 ఏళ్ల ప్రేయసితో 2011లో విడిపోయాడు. తనను ఒంటరిని చేసిందన్న వేదనతో ఆమెకు 21,807 కాల్స్, మెసేజ్ లు పంపించాడు. అంటే ప్రతి రోజూ సరాసరి 73 ఫోన్ కాల్స్ చేసినట్టు దర్యాప్తు బృందాలు వెల్లడించాయి. అతని ఫోన్ల ధాటిని తట్టుకోలేకపోయిన ఆ మాజీ ప్రేయసి ఫోన్ ఆఫ్ చేసేది. అయినా వదలని ఆ ప్రేమికుడు ఆమె ఇంటికి, తల్లిదండ్రులకు, ఆమె పని చేసే ఆఫీసుకు ఫోన్ చేసేవాడు దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతని వ్యవహార శైలిపై విచారణ జరిపిన న్యాయస్థానం 10 నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. అంతకంటే ముందు అతనికి మానసిక చికిత్స చేయించాలని ఆదేశించింది.