: మరోసారి వారిద్దరి మధ్య పోటీ... ఏ సినిమా హిట్టైనా ఆమెకు పండగే!


బాలీవుడ్ లో ఒకేసారి రంగప్రవేశం చేసిన హీరోయిన్ల మధ్య మరోసారి పోటీకి రంగం సిద్ధమైంది. 2007లో బాలీవుడ్ లో 'ఓం శాంతి ఓం' సినిమాతో దీపికా పదుకొనే అరంగేట్రం చేయగా, 'సావరియా' సినిమాతో సోనమ్ కపూర్ వెండితెరపై తళుక్కున మెరిసింది. దీపిక టాప్ హీరోయిన్ గా రాణిస్తుండగా, సోనమ్ కు సరైన హిట్లు లేక నిలదొక్కుకునేందుకు నానాతంటాలు పడుతోంది. అప్పట్లో ఒకేసారి వీరి సినిమాలు రిలీజై పోటీ పడితే, ఏడేళ్ల తరువాత వీరి సినిమాలు మరోసారి పోటీ పడనున్నాయి. అప్పట్లో క్రేజీ కాంబినేషన్ సోనమ్ సొంతమైతే, తాజాగా దీపిక క్రేజీ కాంబినేషన్ తో వెండితెరపై కనబడనుంది. 'ఫైండింగ్ ఫానీ' సినిమాలో యువజంట దీపిక పదుకొనే, అర్జున్ కపూర్ నటించగా, 'ఖూబ్ సూరత్' సినిమాలో సోనమ్ లీడ్ రోల్ లో దర్శనమివ్వనుంది. వారం వ్యవధిలో విడుదలయ్యే వీరి సినిమాల్లో ఏది అభిమానులను ఆకట్టుకుంటుందోనని సినీ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. రెండు సినిమాల్లో ఏది హిట్టైనా సోనమ్ కపూర్ కు సందడే, ఒకటి తన సినిమా అయితే రెండోది తన తమ్ముడు అర్జున్ కపూర్ ది కావడం విశేషం.

  • Loading...

More Telugu News