: గంగానది ప్రక్షాళన ప్రాజెక్టుకు సాయం అందిస్తామంటున్న ఇజ్రాయెల్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలోని ప్రధాన హామీల్లో ఒకటైన గంగానది ప్రక్షాళన ప్రాజెక్టుకు సాయం చేస్తామంటూ ఇజ్రాయెల్ ముందుకొచ్చింది. ప్రాజెక్టులో భాగంగా... నీటి పరిరక్షణ, వ్యర్థజలాన్ని తొలగించేందుకు తమ వంతు సహాయం చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఆ దేశ ఎకనామిక్ అండ్ ట్రేడ్ మిషన్ అధిపతి యోనటన్ బెన్ జకెన్ మాట్లాడుతూ, ఈ విషయమై తాము కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతిని ఇప్పటికే కలిశామని, అంతేగాక సంబంధిత కార్యదర్శిని కూడా పలుమార్లు కలిసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పనిలో తాము భాగం కావాలనుకుంటున్నట్లు చెప్పామన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కోసం తమ విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని తెలిపామని వివరించారు. కాగా, ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల లక్ష్యాన్ని పెట్టుకుంది.