: ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వం: కేజ్రీవాల్
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పోరాటాన్ని తీవ్రం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మేలు చేసే రీతిలో వ్యవహరిస్తుండడంపై మండిపడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి రాసిన లేఖను సవరించుకోవాలన్నారు. బీజేపీ నేతలపై తమ స్టింగ్ ఆపరేషన్ వీడియోకు సంబంధించిన ఓ కాపీ సీడీని ఆప్ రాష్ట్రపతికి పంపుతుందని, నజీబ్ జంగ్ సలహాను పరిశీలనలోకి తీసుకోవద్దని కోరతామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వబోమని, బీజేపీని తప్పక అడ్డుకుంటామనీ అన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు బీజేపీ చేసిన తప్పుడు పనులను బయటపెడతామని హెచ్చరించారు.