: విజయవాడలో చంద్రబాబు ఉండేందుకు ఇల్లు కావాలి!
విజయవాడ వచ్చినప్పుడు చంద్రబాబు ఉండేందుకు గాను ఓ ఇంటి కోసం ప్రభుత్వ వర్గాలు వెతుకులాటలో పడ్డాయి. క్యాంపు కార్యాలయంలా ఉండే ఇల్లును తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. విజయవాడను ఏపీకి తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన తర్వాత వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలన్నీ విజయవాడ షిప్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారంలో కొన్ని రోజులు హైదరాబాద్ లో... మరికొన్ని రోజులు విజయవాడలో ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో ఆయన ఇక్కడకు వచ్చినప్పుడల్లా నివాసం ఉండడానికి తాత్కాలికంగా ఓ పెద్ధ భవనం కోసం అధికారులు వెతుకుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు చూపెట్టేందుకు ఓ భవనాన్ని అధికారులు సిద్ధం చేశారని సమాచారం.