: దర్శకుడు రాఘవేంద్రరావు సహా నలుగురికి గీతం యూనివర్శిటీ డాక్టరేట్ లు
ప్రముఖ విశ్వవిద్యాలయం గీతం వివిధ రంగాల్లోని ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ లు ప్రకటించింది. సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు, కవి, సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, డీఆర్డీవో కార్యదర్శి అవినాష్ చందర్ లకు డాక్టరేట్ లు ప్రకటించినట్లు యూనివర్శిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 13న జరగనున్న యూనివర్శిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో వారికి డాక్టరేట్ లను ప్రదానం చేస్తారు.