: జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు తమిళనాడు, ఒడిశాల సహాయం
జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు పలు రాష్ట్రాలు తమ వంతుగా సాయం ప్రకటిస్తున్నాయి. తాజాగా వరద బాధితుల సహాయార్థం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విరాళంగా ప్రకటించగా, అటు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా రూ. ఐదు కోట్ల సాయం ప్రకటించారు. అంతేగాక అవసరమైన ఎలాంటి ఇతర సహాయమైనా చేస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.