: కాళోజీకి కేసీఆర్ నివాళి
ప్రజాకవి కాళోజీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. కాసేపటి క్రితం వరంగల్ చేరుకున్న ఆయన... స్థానికంగా ఉన్న నక్కలగుట్టలో కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. కాసేపట్లో బాలసముద్రంలో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేయనున్నారు. కేసీఆర్ రాక నేపథ్యంలో, వరంగల్ పట్టణం గులాబీ మయమైంది. ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.