: 45 విమానాలు, హెలికాప్టర్లతో కొనసాగుతున్న సహాయక చర్యలు
భీకర వరదలు జమ్మూకాశ్మీర్ ను అతలాకుతలం చేశాయి. మృతుల సంఖ్య 200కు చేరింది. వందలాది గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. 20 వేల మంది సైనికులు, 65 మెడికల్ టీంలు, 15 ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రక్షణ దళాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు 45 వరకు రెస్క్యూ ఆపరేషన్ లో పాలుపంచుకుంటున్నాయి. శ్రీనగర్ లో ఫోన్ లైన్లను పునరుద్ధరించడానికి మరో 72 గంటలు పడుతుందని ఆర్మీ తెలిపింది. అలాగే, జమ్మూ-శ్రీనగర్ రహదారిని పునరుద్ధరించేందుకు మరో 4,5 రోజులు పడుతుందని తెలిపింది.