: అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైన జగన్... కేసు వాయిదా
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈ రోజు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణ నేపథ్యంలో ఆయన కోర్టుకు వచ్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసును 22వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.