: సీబీఐ డైరెక్టర్ సిన్హాకు సుప్రీంకోర్టు నోటీసు
బొగ్గు కుంభకోణం నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను తొలగించాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆయనపై సిట్ ద్వారా విచారణ జరపాలన్న విన్నపాన్ని కూడా పరిశీలించింది. ఈ మేరకు వస్తున్న ఆరోపణలపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ సిన్హాకు సుప్రీం నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.