: మహా గణాధిపతిపై నేడు మరోసారి పూలవర్షం


హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణాధిపతిపై నేడు మరోసారి ఛాపర్ నుంచి పూలవర్షం కురవనుంది. నిన్న సాయంత్రం మహా గణపతిపై పూలవర్షం కురిపించినప్పటికీ... వాతావరణం, గాలి వీచే దిశ తదితర కారణాల వల్ల ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. అనుకున్నంతగా పూలు వినాయకుడిపై పడలేదు. దీంతో, మరోసారి పూలవర్షం కురిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మధ్యాహ్నం నిమజ్జనం సమయంలో ట్యాంక్ బండ్ పై పూలవర్షం కురిపించనున్నారని ఉత్సవ కమిటీ ప్రకటించింది.

  • Loading...

More Telugu News